బంగాళాఖాతంలో యుద్ధ నౌక నుంచి బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా నౌకాదళం ప్రయోగించింది. సుదూరంలో ఉన్న నిర్దిష్ట లక్ష్యాన్ని బంగాళాఖాతంలో ఉన్న యుద్ధ నౌక ఐఎన్ఎస్ రణ్ విజయ్ నుంచి ప్రయోగించారు. ఇది లక్ష్యాన్ని సరిగ్గా చేరుకుని మంచి ఫలితం చూపిందని భారత నౌకాదళం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
నౌకాదళం ఏ సమయంలోనైనా ఎలాంటి పోరాటానికి సిద్దమన్నది తాజా ప్రయోగం విజయవంతమే సంకేతమని నేవీ ప్రకటించింది.
![navy tweet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9729103_17_9729103_1606832755945.png)
ఇవీ చదవండి..