ETV Bharat / state

క్రషర్​ దగ్గర ప్రమాదం..చేయి పోగొట్టుకున్న 12 ఏళ్ల బాలుడు - visakha district latest accident news

అనకాపల్లి మండలం కూడ్రం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. 12 ఏళ్ల బాలుడి చెయ్యి క్రషర్​లో తెగిపడి తల్లిదండ్రులకు కన్నీటిని మిగిల్చింది. కూలి పనుల కోసం వెళ్లిన తల్లిదండ్రులతో పాటు కుమారుడు పవన్​ అక్కడకు వెళ్లాడు. ప్రస్తుతం బాలుడు కేజీహెచ్​లో చికిత్స పొందుతున్నాడు.

boy hand cut in crusher at kudram village in anakapalle mandal in viskaha district
ఆసుపత్రిలో చికిత్స పొందతున్న 12 ఏళ్ల బాలుడు
author img

By

Published : Jul 17, 2020, 3:44 PM IST

12 ఏళ్ల బాలుడి చెయ్యి క్రషర్​లో పడి తెగిపడిన ఘటన విశాఖ జిల్ల అనకాపల్లి మండలం కూడ్రం గ్రామంలో విషాదాన్ని నింపింది. కూడ్రం గ్రామానికి చెందిన శ్రీను, మంగలకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. తల్లిదండ్రులు కూలి పనుల కోసం అచ్యుతాపురం గ్రామానికి వెళ్లారు. కుమారుడు పవన్​కుమార్​ ఆడుకుంటూ క్రషర్​ వద్దకు వెళ్లాడు. వైబ్రేటర్​ దగ్గర కన్వీనర్​ బెల్టు తిరుగుతండగా... దీన్ని గమనిస్తూ కుడి చెయ్యి అందులో పెట్టాడు. భుజం వరకు తెగిపడటంతో క్రషర్​ సిబ్బంది అనకాపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేజీహెచ్​కు తీసుకెళ్లారు. కుమారుడి పరిస్థితి చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై రామకృష్ణారావు తెలిపారు.

ఇదీ చదవండి :

యాచకునిపై దూసుకెళ్లిన కారు... తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.