విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలం కుంచంగి గ్రామానికి చెందిన అప్పారావు లైన్మెన్గా పని చేస్తున్నారు. విధుల్లో భాగంగా రంగంవానిపాలెంలోని ఎర్రినాయుడు చెరువు వద్దకు కుమారుడు అశోక్‌తో కలిసి వెళ్లాడు. విద్యుత్ నియంత్రికకు మరమ్మతులు చేస్తుండగా... ప్రమాదవశాత్తు అశోక్ కుడికాలికి విద్యుత్ తీగ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్ల ముందే కుమారుడు మృతి చెందటంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు పలువురిని కన్నీరు పెట్టించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచదవండి.