ETV Bharat / state

వందసార్లు రక్తదానం చేసిన విశాఖ వ్యక్తి - విశాఖ వ్యక్తి రక్తదానం

విశాఖ జిల్లా సాగర్​నగర్​కు చెందిన సాయిబాబా శ్రీనివాస్ ఇప్పటి వరకు వందసార్లు రక్తదానం చేశారు. రక్తదానం దానం వల్ల దాతకు ఎటువంటి అనారోగ్యం కలగదన్నారు. 30 ఏళ్ల కిందట రక్తం దొరక్క తన తండ్రి పడిన ఇబ్బందిని గమనించి అప్పటి నుంచి రక్తదానం చేస్తున్నట్లు వెల్లడించారు.

వందసార్లు రక్తదానం చేసిన విశాఖ వ్యక్తి
వందసార్లు రక్తదానం చేసిన విశాఖ వ్యక్తి
author img

By

Published : Sep 25, 2020, 4:23 PM IST

రక్తం దొరక్క 30 ఏళ్ల కిందట తన తండ్రి పడిన ఇబ్బందిని ఎవరూ పడకూడదని నిర్ణయించుకున్నాడో కుమారుడు. అప్పటి నుంచి ప్రతి ఏటా మూడు విడతలుగా రక్తదానం చేస్తూ...ప్రాణదాతగా మారాడు. విశాఖ జిల్లా సాగర్​నగర్​కు చెందిన సాయిబాబా శ్రీనివాస్ ఇప్పటి వరకు వందసార్లు రక్తదానం చేశారు. 100వ సారి రక్తదానం చేసిన సందర్భంగా ఏఎస్​ రక్తనిధి కేంద్రం వారు సర్టిఫికెట్ అందించినట్లు శ్రీనివాస్ తెలిపారు. రక్తదానం చేయటం వల్ల దాతకు ఎటువంటి అనారోగ్యం కలగదన్నారు. తనను ఆదర్శంగా తీసుకొని చాలా మంది రక్తదానం చేయటానికి ముందుకొచ్చారని వెల్లడించారు. మరణానంతరం తన అవయవాలను వైద్యశాలకు అందించేలా అంగీకార ప్రతం అందించనట్లు శ్రీనివాస్ తెలిపారు.

ఇదీచదవండి

అక్టోబర్​లో కొవాగ్జిన్​ 3వ దశ క్లినికల్​ ట్రయల్స్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.