BJP Leaders Fired on YCP Leaders: విశాఖలో వైకాపా నేతలు ప్రభుత్వ భూములు ఆక్రమించి విల్లాలు కడుతున్నారని రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ అన్నారు. విశాఖ భాజపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఒక వర్గం వారే భూ అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పారు. దసపల్లా భూములు అక్రమించారు.. 22 ఏలో ఉన్న భూములు లాక్కుని అగ్రిమెంట్ కుదుర్చుకున్నారని అన్నారు. భూ కుంభకోణంపై సీబీఐ ఈడీకి ఫిర్యాదు చేస్తామన్నారు. వివాదాల్లో ఉన్న భూములు ఎవరూ కొనొద్దని,.. కొంటే తరువాత ఇబ్బంది పడతారని అన్నారు. ప్రధాని పర్యటనలో వైకాపా నేతలు హడావిడి చేస్తున్నారని.. వాళ్ల ఆటలు సాగవన్నారు.
"రీ సర్వే ద్వారా రాష్ట్రంలో ఎక్కడెక్కడ భూములున్నాయో.. వాటి లెక్కలు తీయడం... అవసరమైన వాటిని 22ఏ లో చేర్చడం.. ఆ వివాదాల్లో ఆ పార్టీ నాయకులే జోక్యం చేసుకోవడం.. ఒక సొంత డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసుకుని వివాదాస్పద భూముల్లో జోక్యం చేసుకుని లక్షల ఏకరాల భూములను కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం భూమినంతా రాబందుల్లా దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు." సత్యకుమార్, భాజపా జాతీయ కార్యదర్శి
రాష్ట్రంలో విధ్వంసకరమైన పాలన సాగుతోందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి విమర్శించారు. మద్యం కుంభకోణంలో శరత్చంద్ర రెడ్డి అరెస్టయ్యారని.. ఆయన ఎవరి బంధువో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. అవినీతి, ఆక్రమణలు తప్ప వైకాపా ప్రభుత్వం చేసిందేమీ లేదనేందుకు ఇదే నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రజావేదిక కూల్చివేతతో వైకాపా పాలన ప్రారంభమైందని దుయ్యబట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందన్నారు.
"రాష్ర్టంలో విధ్వంసకరమైన పాలన సాగుతోంది. మొన్న జరిగిన ఇప్పటం విధ్వసం ప్రజలందరూ చూస్తున్నారు. అదేవిధంగా విశాఖలో జరిగిన కూల్చివేతలు కావచ్చు. విశాఖలో భూముల విషయానికి వస్తే ఏ విధంగా అక్రమణకు గురవుతున్నాయో ఏవరికి తెలియనటువంటి విషయం కాదు. పేదలకు అందవలసిన పథకాలు కూడా సరియైన పద్ధతిలో అందటం లేదు." -పురందేశ్వరి, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి
ఇవీ చదవండి: