రాష్ట్ర ప్రభుత్వ తీరుపై భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ విమర్శలు గుప్పించారు(BJP Leader Vishnu Kumar Fires YCP news). విశాఖలో మాట్లాడిన ఆయన.. తినడానికి తిండిలేని పరిస్థితుల్లోకి కాంట్రాక్టర్లను తీసుకెళ్లిన చరిత్ర జగన్‌కే దక్కుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా పాలనలో కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందన్నారు. జగన్ ప్రభుత్వం తాత్కాలికమని.. వచ్చేది భాజపా సర్కారేనని వ్యాఖ్యానించారు. కాంట్రాక్టర్లు ఎవరూ అధైర్యపడవద్దని పిలుపునిచ్చారు.
విశాఖలో పలు ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టిన వైకాపాకు.. వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావన్నారు. వైకాపా నేతలు ఎకరాల్లో ఇళ్లు కట్టుకుంటుంటే.. ప్రజలు మాత్రం సెంటు, సెంటున్నర ఇవ్వడం సమంజసమేనా అని ప్రశ్నించారు. ఇంద్రకీలాద్రిపై అన్యమత ప్రచారంపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు జనసేనలో చేరడమనేది అవాస్తమన్నారు. కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.