స్థానిక సంస్థలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందినట్లని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. అందుకే కేంద్రంలోని భాజపా ప్రభుత్వం స్థానిక సంస్థల బలోపేతానికి అధిక నిధులు కేటాయిస్తోందని చెప్పారు. అలాంటి పార్టీని ఆదరించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలు అంటే స్థానికంగా ఉండే నాయకులను ఎన్నుకోవడమేనని అన్నారు. విశాఖ నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నిధులు ఇచ్చిందని గుర్తుచేశారు. స్టీల్ ప్లాంట్‌పై ఎవ్వరు ఎలాంటి దరఖాస్తులు పెట్టలేదని అమిత్ షా స్పష్టం చేశారని ఆయన తెలిపారు.
ఇదీ చూడండి: