రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం మంచిదేనని... సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యక్తిగతంగా స్వాగతిస్తున్నట్లు భాజపా నేత విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. తెలుగును పూర్తిగా విస్మరించకుండా... పిల్లలకు ఆంగ్లం నేర్పేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్రంగా ఉందని... ఎలాంటి అనుమానం లేదన్నారు. కొత్త విధానంలో ఇసుక అక్రమాలు జరుగుతున్నాయని... ఆధార్ కార్డులతో కొందరు బ్రోకర్లు ఇసుకను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ధరల పెంపుతో సిమెంట్ తయారీ సంస్థలు దోపిడికి తెరతీశాయని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: మసీదులో ప్రార్థన వినగానే... చంద్రబాబు ఏం చేశారో తెలుసా..?