రాష్ట్రంలో వృద్ధులు వికలాంగులకు పింఛన్ల పంపిణీలో మళ్లీ బయోమెట్రిక్ విధానం అమల్లోకి రానుంది. ఈ మేరకు సెప్టెంబర్ 1 నుంచి దీన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా కారణంగా వృద్ధులు, దివ్యాంగులకు పింఛన్ల పంపిణీకి సంబంధించి బయోమెట్రిక్ విధానాన్ని ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రద్దు చేశారు. అయితే సెప్టెంబర్ నుంచి పింఛన్ల పంపిణీకి సంబంధించి మరోసారి బయోమెట్రిక్ విధానాన్ని అమలులోకి తీసుకు వచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇకపై పింఛన్లు పొందే వారంతా విధిగా బయోమెట్రిక్ విధానాన్ని పాటించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా సెప్టెంబర్ నెల నుంచి రాష్ట్రంలో మరో 80 వేల మందికి పింఛన్లు మంజూరు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఇదీ చదవండి: 'హైకోర్టు సీజే బెంచ్‌కు ప్రకటనల వ్యాజ్యం బదిలీ'