విశాఖ జిల్లా పాడేరులో భారతి అనే మహిళకు పూలమొక్కలు పెంచడం అంటే ఇష్టం. ఆ మక్కువతోనే గత మూడేళ్లుగా తన ఇంట్లో బ్రహ్మ కమలాల మొక్కలు పెంచుతున్నారు. ఆకు నుంచి మొగ్గ వచ్చే ప్రత్యేక లక్షణం కలిగిన ఈ పుష్పాలు ఈ ఏడాది విరబూశాయి. చిన్న మొక్కకు 20కిపైగా బ్రహ్మ కమలాలు పూశాయి . చుట్టుపక్కల మహిళలు ఆ పూలను చూసేందుకు ఆశక్తి చూపారు.
ఇదీ చదవండి: సూర్య గ్రహణం కారణంగా ఆదివారం శ్రీవారి దర్శనం రద్దు