విశాఖ జిల్లా అనకాపల్లిలో బాషా స్మారక పురస్కార ప్రదానోత్సవం జరిగింది. ఉత్తమ యువ సామాజిక కార్యకర్తకు అందించే అవార్డును... హైదరాబాద్కు చెందిన మీరా సంఘమిత్రకి ప్రదానం చేశారు. చిన్న వయసులోనే సమాజం గురించి తపన చెందిన వ్యక్తి భాషా అని అవార్డు గ్రహీత మీరా కీర్తించారు. అతని పేరుమీద ఇస్తున్న అవార్డు తనకు దక్కటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తనకు బహుమతిగా ఇచ్చిన 25 వేల నగదును ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆదివాసీ పిల్లల అభివృద్ధి కోసం పని చేస్తున్న 'రేలా' అనే స్వచ్ఛంద సంస్థకు ఇస్తున్నట్టు తెలిపారు. ప్రతీ ఒక్కరూ కొంత సమయాన్ని సమాజసేవ కోసం కేటాయించాలని సమాచార మాజీ కమిషనర్ దిలీప్ రెడ్డి సూచించారు.
ఇది కూడా చదవండి