విశాఖ జిల్లా అనకాపల్లి నూకాలమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరారు. ఏప్రిల్ 4 నుంచి మే 4 వరకు జరిగుతున్న జాతరలో భాగంగా ఆది, మంగళ, గురువారాల్లో భక్తులు అమ్మవారిని పెద్ద సంఖ్యలో దర్శించుకుంటారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థాన అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వచ్ఛంద సంస్థలు మజ్జిగ, మంచినీరు అందించారు.
ఇది కూడా చదవండి.