ETV Bharat / state

పోలీసుల తనిఖీల్లో భారీగా గంజాయి పట్టివేత - visakha

విశాఖ మన్యం నుంచి మహారాష్ట్రకు  తరలిస్తున్న గంజాయిని జిల్లా పోలీసులు పట్టుకున్నారు.

గంజాయి పట్టివేత
author img

By

Published : Aug 29, 2019, 7:09 AM IST

పోలీసుల తనిఖీల్లో గంజాయి పట్టివేత

విశాఖపట్నం జిల్లా మాడుగుల మండలం ఎం.కోటపాడు వద్ద పోలీసులు భారీస్థాయిలో గంజాయి పట్టుకున్నారు. మాడుగుల ఎస్ఐ తారకేశ్వరరావు సిబ్బందితో తనిఖీలు చేస్తుండగా.. కారులో తరలిస్తున్న సరుకును స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్రవాహనంతో పాటు కారులో తరలిస్తున్న సుమారు 6లక్షల 10 వేల రూపాయల విలువైన 310 కేజీల గంజాయిని గుర్తించారు. జి. మాడుగులలో కొనుగోలు చేసి, మహారాష్ట్రకు తరలిస్తున్నట్టు నిందితులు తెలిపారు. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ ఉన్న కారుకు ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ బోర్డు తగిలించి గంజాయి రవాణా చేస్తున్నారు. ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 10 వేల 600 నగదు, 4 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి, రిమాండ్ కు తరలించారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి.

"ఎలక్ట్రికల్ మీటర్​ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి"

Intro:ఉలవల కోసం కరువు రైతుల క్యూ...
చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న ఉలవలను తీసుకునేందుకు రైతులు క్యూ కడుతున్నారు. రైతులు అన్ని పనులు వదులుకుని ఉదయాన్నే వచ్చి వరుసక్రమంలో నిలబడుతున్నారు. ఉలవలను తీసుకునేందుకు ముందుగా పర్మిట్లు తీసుకోవాల్సి ఉంది . ఈ పర్మిట్ల కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. పెద్ద సంఖ్యలో రైతులు తరలి వస్తుoడంతో పోలీసులు సైతం తోపులాట లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. పర్మిట్ కేంద్రాల వద్ద బారికేడ్లను సైతం ఏర్పాటు చేశారు. పీలేరు నియోజకవర్గం లోని కలికిరి, వాల్మీకిపురం , గుర్రంకొండ, కె.వి పల్లి, పీలేరు, కలకడ మండలాల్లో సుమారు రెండు వేల క్వింటాళ్ల వరకు రైతులకు పంపిణీ చేశారు. ఒక్క రైతుకు పది కిలోల చొప్పున ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. సకాలంలో వర్షాలు కురవక పొలాలను బీల్లు పెట్టుకున్న రైతులు ఉలవలను చల్లి సాగు చేయాలని ఆలోచిస్తున్నారు. ఉలవ సాగు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది . ఉలవపొట్టు పశువులకు మేతగా .. ఉలవలు దానా గా ఉపయోగపడతాయి. కావున ఉలవ పంటకు ప్రాధాన్యత సంతరించుకుంది. జిల్లాలోని రైతులు వేరుశనగ పంటకు ప్రత్యామ్నాయంగా అధిక విస్తీర్ణంలో ఉలవసాగు చేస్తారు..

Body:ఉచిత ఉలవల పంపిణీ

Conclusion:చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో నీ రైతులు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న ఉలవల కోసం
ఎ గపడుతున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.