యాచిస్తున్న బాలలను బడికి పంపాలనే ధ్యేయంతో తమ సంస్థ కృషి చేస్తోందని బెగ్గింగ్ హాండ్స్ అబాలిషన్ ఇన్ ఇండియా సంస్థ కన్వీనర్ జీవన్ స్పష్టం చేశారు. 'ఎథికల్ జనరేషన్' పేరిట విశాఖలో పలు ప్రభుత్వేతర సంస్థలతో బాలల హక్కులపై సదస్సు నిర్వహించారు. బాలలను యాచక సమాజం నుంచి బయటకు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో మానవ హక్కుల కౌన్సిల్ కన్వీనర్ శ్యాం ప్రసాద్, జువైనల్ జస్టిస్ బోర్డు మాజీ చైర్మన్ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి