ETV Bharat / state

పాల సముద్రాన్ని తలపిస్తున్న విశాఖ వంజంగి మంచు కొండలు - latest news in vishaka

పాల సముద్రం నడుమ కొలువైన పచ్చని కొండలు. శంఖ ధ్వనిని మైమరిపించే చల్లని గాలుల సవ్వడి. సందడి చేస్తున్న పక్షుల కిలకిలారావాలు. వీటన్నింటి సమ్మిళిత కలయికే వంజంగి కొండలు. ఈ ప్రాంతం సహజ సిద్ధ అందాలతో భూతల స్వర్గాన్ని తలపిస్తోంది. ప్రకృతి ప్రేమికులు ఈ అందాలను ఆస్వాదించటానికి పోటీ పడుతుంటారు.

beauty of vanjangi
విశాఖ వంజంగి అందాలు
author img

By

Published : Dec 6, 2020, 3:09 PM IST

విశాఖ వంజంగి అందాలు

పచ్చని కొండల మధ్య తేలియాడే పాల సముద్రం వంటి మేఘాల సమూహం. మరో వైపు పచ్చని చెట్లతో పాటు పక్షుల కిలకిలారావాల సంగీతం. చల్లటి గాలలతో స్వర్గాన్ని తలపిస్తున్న ఈ అందాలు విశాఖ జిల్లా వంజంగి సొంతం. సహజ సిద్ధ సౌందర్యంతో రంజింపజేస్తున్న ఈ ప్రకృతి రమణీయతను ఆస్వాదించటానికి పర్యటకులు పోటీ పడుతున్నారు.

సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రకృతి ప్రేమికులు ఇక్కడికి చేరుకుంటున్నారు. మిత్ర బృందాలు, కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ చల్లని ప్రాంతంలో సేదతీరుతున్నారు. అలాగే మేఘాల చాటు కొండలతో కనువిందు చేస్తున్న ఈ అందాలను పర్యటకులు తమ చరవాణిలో బంధిస్తున్నారు.

ఇదీ చదవండి:

నెల్లూరును వదలని వానలు.. చెరువులను తలపిస్తున్న రహదారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.