ETV Bharat / state

విశాఖ బీచ్​రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు

విశాఖ బీచ్​రోడ్డులో శనివాకం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీపావళి సందర్భంగా కొందరు బీచ్ రోడ్డులో బాణాసంచా కాల్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు.

author img

By

Published : Nov 14, 2020, 12:13 PM IST

beach-road-
beach-road-

దీపావళి పండగ సందర్భంగా బీచ్‌రోడ్డులో శనివారం ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. కొందరు బాణసంచాను బీచ్‌రోడ్డులో కాల్చేందుకు ఆసక్తి కనబరుస్తారు. దీంతో ఇతరులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని భావించిన పోలీసులు బీచ్‌రోడ్డులో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. శనివారం సాయంత్రం 5 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు రామకృష్ణాబీచ్‌, నేవల్‌ కోస్టల్‌ బ్యాటరీ నుంచి పార్కు హోటల్‌ వరకు అన్ని రకాల వాహనాల రాకపోకలను నిషేధించామని ట్రాఫిక్‌ ఏడీసీపీ ఆదినారాయణ తెలిపారు. నగరవాసులు పోలీసులకు సహకరించాలని కోరారు.

ఇదీ చదవండి: దేశంలో మరో 44,684 మందికి కరోనా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.