భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ భాగవతుల వెంకట పరమేశ్వరరావు (86) విశాఖ కేర్ హాస్పిటల్లో ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. ద్వారకానగర్ లోని ఆయన పార్థీవ దేహానికి పలువురు నివాళులు అర్పించారు. ట్రస్ట్ ద్వారా లబ్ది పొందిన ప్రజలు, అభిమానులు కడసారి చూసేందుకు భారీగా తరలివచ్చారు. సేవారంగంలో బీసీటీ వెంకట పరమేశ్వరరావు చిరస్మరణీయులని పలువురు కొనియాడారు.
మాతృ భూమి కోసం...
1933 లో దిమిలి గ్రామంలో డాక్టర్ భాగవతుల వెంకట పరమేశ్వరరావు జన్మించారు. న్యూక్లియర్ సైన్స్ లో అమెరికా విశ్వవిద్యాలయం నుంచి పరోశోధనకు గాను డాక్టరేట్ పొందిన ఆయన ... మాతృ భూమికి సేవలందించేందుకు ఉత్తరాంధ్రకు వచ్చారు. భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి 43 మూడేళ్ళుగా మూడు మండలాలు, వంద గ్రామాల్లో సేవలు అందిస్తున్నారు.
ప్రముఖుల నుంచి ప్రశంసలు...
ట్రస్ట్ ద్వారా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి వెంకట పరమేశ్వరరావు చేస్తున్న కృషికి... అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు తో పాటు పలువురు ప్రముఖులు ఆయన సేవలను ప్రశంసించారు. గ్రామీణ విద్యాలయాలు, వ్యవసాయపరమైన సహకారం, మహిళా అభివృద్ధి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే శిక్షణ, ఆరోగ్య రక్షణ అంశాల్లో అనేక సేవలను అందించారు.
ఇవీ చూడండి-ముస్లింల సమస్యలను పరిష్కరిస్తా: మంత్రి అంజాద్ బాషా