విశాఖ మన్యంలో వివాదాస్పదంగా మారిన బాక్సైట్ తవ్వకాల ప్రయత్నాలకు తెరపడింది. తవ్వకాల లీజును రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో చింతపల్లి మండలం జర్రెలా బ్లాక్‌లో బాక్సైట్ తవ్వకాల కోసం రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కు ప్రభుత్వం అనుమతిచ్చింది. బాక్సైట్ తవ్వకాలు గిరిజనుల జీవనానికి ఆటంకంగా మారుతున్నాయని స్థానికుల నుంచి వ్యతిరేకత వస్తున్న కారణంగా గతంలో ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రాష్ట్ర సర్కార్ రద్దు చేసింది.
ఉప ముఖ్యమంత్రి హర్షం
గిరిజనుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి అన్నారు. సీఎం గిరిజనులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారన్న ఆమె... ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాల జీవోను రద్దు చేసిందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు.
ఇదీ చదవండి: