బాస్కెట్ బాల్ పోటీలు విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో ప్రారంభమయ్యాయి. అండర్ -19, అండర్ -17 బాలురు, బాలికలు విభాగాల్లో 3 రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. క్రీడాకారుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ నెలకొల్పడమే ఈ టోర్నమెంట్ ఉద్దేశమని రాష్ట్ర బాస్కెట్ బాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డా.స్టాలిన్ పేర్కొన్నారు. విజయంపై ఆయా జట్ల క్రీడాకారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి