విశాఖమన్యంలో గిరిజన సంఘం బంద్కు పిలుపునిచ్చింది. పోడు భూములకు పట్టాలు ఇచ్చి రైతు భరోసా అవకాశం కల్పించాలని డిమాండ్ చేసింది. మన్యం ప్రాంతంలో చాలామందికి పట్టాలు ఇవ్వటంలో ఆలస్యం చేస్తున్నారని గ్రామస్తులు మండిపడ్డారు. కేంద్రం గిరిజనులపై వ్యతిరేకతతో అటవీ భూములపై హక్కు కోల్పోతున్నామని... ఈ కారణంతో బంద్ చేస్తున్నామని గిరిజన సంఘం నాయకులు తెలిపారు. పాడేరు ఏజెన్సీ సహా ఆంధ్ర ప్రాంతానికి గిరిజన సంఘం బందుకు పిలుపునిచ్చింది. పాడేరులో ఉదయం నుంచి బస్సులను అడ్డుకున్నారు.
ఇవీ చదవండి