ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని విశాఖ ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ లో నిర్వహించనున్నారు. నేటి నుంచి జూన్ 20 వరకు వీటిని చేపట్టనున్నారు. ఏసియాటిక్ వైల్ డాగ్ జాతుల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం సర్కిల్ కంజర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రామ్మోహన్ రావు, విశాఖ ఇందిరా జూ లాజికల్ పార్క్ కూరేటర్ నందిని సలారియా నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతోంది.
ఆసియాటిక్ వైల్డ్ డాగ్స్ గురించి, వాటి జీవన విధానం, ఆహారం వంటి విషయాలు ప్రజలకు తెలియజేయడమే ఈ వేడుక ముఖ్య ఉద్దేశ్యం. పిల్లలు , పెద్దలు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి విషయాలు తెలుసుకోవాలని జూ అధికారులు కోరుతున్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాల పూర్తవుతున్న సందర్భంగా 75 జాతులకు సంబంధించి.. ఆజాదీకీ అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ క్యురేటర్ డా. నందనీ సలారియా తెలిపారు. క్విజ్, డ్రాయింగ్, షార్ట్ స్టోరీ.. ద్వారా అవగాహన కల్పించనున్నారు.
ఇదీ చదవండి: