ETV Bharat / state

యంత్రవిద్యకు ఊతం...ఏయూ నైపుణ్యాభివృద్ధి కేంద్రం - AU Siemens Excellence center

చదువుతోనే భవిత అనేది ఒకప్పటి మాట. సృజనాత్మక విద్యే భవిష్యత్తుకు భరోసా అనేది నేటి మాట. దేశ భవిష్యత్తు నైపుణ్యులైన యువత చేతుల్లో ఉందన్న ప్రధాని మాటలకు ఆచరణ రూపమే సిల్క్ ఇండియా నినాదం. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థుల్లో వినూత్న ఆలోచనల్ని ప్రోత్సహిస్తే...కళాశాల స్థాయికి వచ్చేసరికి ఆ ఆలోచనలు ఆచరణాత్మకం అవుతాయి. విద్యార్థులకు అటువంటి శిక్షణ అందించాలనే లక్ష్యంతో ప్రైవేటు సంస్థలు-విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో ఆంధ్ర యూనివర్శిటీలో ఏర్పాటుచేసిన సీమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్స్​లెన్స్​పై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

యంత్రవిద్యకు ఊతం...ఏయూ నైపుణ్యాభివృద్ధి కేంద్రం
author img

By

Published : Jul 31, 2019, 2:12 PM IST

ఇంజినీరింగ్ విద్యలో నైపుణ్యానికే అగ్రస్థానం. ఆధునిక పరిజ్ఞానంపై పట్టు ఉంటేనే కొలువుల సాధన సాధ్యమవుతుంది. అందుకే విద్యాలయాలు సైతం నైపుణ్య బాటపట్టాయి. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఆంధ్ర విశ్వవిద్యాలయం(ఏయూ), సీమెన్స్ కంపెనీ సంయుక్తంగా విశాఖలో సెంటర్ ఆఫ్ ఎక్స్​లెన్స్ ఏర్పాటుచేసి... పరిశ్రమలకు అవసరమైన విద్యలో విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నారు. అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉన్న ఎక్స్​లెన్స్​ సెంటర్​లో... సుమారు 6 వేల మంది విద్యార్థులు తమ నైపుణ్యాన్ని పెంచుకునే పనిలో పడ్డారు.

యంత్రవిద్యకు ఊతం...ఏయూ నైపుణ్యాభివృద్ధి కేంద్రం

అత్యాధునిక పరికరాలతో శిక్షణ

పరిశ్రమల్లో వినియోగించే పరికరాలను సీమెన్స్ కంపెనీ ఈ కేంద్రంలో ఏర్పాటుచేసింది. ఇక్కడ రోబోటిక్ ఆపరేటింగ్ టెక్నాలజీ, ఆటోమేషన్, సీఎన్సీ ప్రోగ్రామింగ్ వంటి అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఎలక్ట్రికల్ అండ్ ఎనర్జీ స్టడీస్ ల్యాబ్, మెకట్రానిక్స్ ల్యాబ్, ప్రాసెస్ ఇన్ట్ర్సుమెంటేషన్ ల్యాబ్, ప్రొడక్ట్ డిజైన్ అండ్ వ్యాలిడేషన్ ల్యాబ్ అందుబాటులో ఉంచారు. అత్యంత ఖరీదైన త్రీడీ ప్రింటర్​ను సైతం ఈ కేంద్రంలో ఉంచారు.

ఉత్తరాంధ్ర విద్యార్థులకు సదావకాశం

అత్యాధునిక సదుపాయాలు కలిగి ఉన్న ల్యాబ్​లను విద్యార్థులకు అందుబాటులో ఉంచి.. శిక్షణ ఇస్తున్నామని ఏయూ ఆచార్యులు అంటున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కళాశాలల విద్యార్థులకు సైతం సీమెన్స్ కేంద్రం ఉపయోగపడుతోంది. ఈ సౌకర్యాలను వినియోగించుకోవాలని ఏయూ ఆచార్యులు వివిధ ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలకు సూచించారు. పూర్తి ఉచితంగా అందిస్తున్న ఈ శిక్షణ ద్వారా విద్యార్థుల్లో వృత్తి పరమైన నైపుణ్యాలు ఎంతగానో మెరుగుపడతాయని ఆచార్యులు అంటున్నారు.

సీమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్స్​లెన్స్​లో ఇంజినీరింగ్ విభాగాలకు సంబంధించిన వివిధ కోర్సులు నేర్పుతున్నారు. ఇంజినీరింగ్ చదువుతున్న, పూర్తిచేసిన విద్యార్థుల కోసం ప్రత్యేక కోర్సులు నిర్వహిస్తూ ఉపాధి మార్గాలు పొందే అవకాశాన్ని కల్పిస్తున్నారు.

ఇదీ చదవండి : ఒడిసిపడదాం... భవిష్యత్​ తరానికి ప్రాణాధారమిద్దాం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.