విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేస్తున్న సుమారు 30 మంది విద్యార్థులు యూజీసీ ఫెలోషిప్ తీసుకుంటూనే... గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు పొందారు. 4 నెలలుగా ప్రభుత్వ జీతాలు అందుకున్నారు. ఈ విషయాన్ని వర్శిటీలోని కొందరు విద్యార్థులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సరైన స్పందన లేకపోవడం వల్ల కలెక్టర్ వినయ్చంద్కు ఫిర్యాదు చేశారు. అతని ఆదేశాల మేరకు వర్శిటీ అధికారులు రంగంలోకి దిగి ఇప్పటివరకూ ఆరుగుర్ని గుర్తించారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఉపకులపతికి నివేదక ఇవ్వనున్నారు.
ఇదీ చూడండి: 'మా వార్తలు వేయని టీవీ, పేపర్లను బహిష్కరిస్తాం'