విశాఖ ఉక్కు కర్మాగారం సీఎండీగా అతుల్ భట్‌ను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. మెకాన్ సంస్ధకు సీఎండీగా వ్యవహరిస్తున్న అతుల్ భట్‌ను ఈ పదవికి గతనెలలోనే పబ్లిక్ సెక్టార్స్ ఎంపిక కమిటీ ఖరారు చేసింది. అపాయింట్‌మెంట్ కమిటీ ఆఫ్ కేబినెట్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2024 నవంబర్ 30వరకు అతుల్ భట్ ఈ పదవిలో ఉంటారని వివరించింది. ప్రస్తుతం సీఎండీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న డైరెక్టర్ దేబ్ కళ్యాణ్ మహంతి నుంచి అతుల్ భట్ బాధ్యతలను స్వీకరించనున్నారు.
అతుల్ భట్ స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్ ప్లాన్ 2025 రూపకల్పన చేసి పలు కంపెనీల టేకోవర్, మెర్జింగ్లో కీలక పాత్ర పోషించారు. తర్వాత 2016 అక్టోబర్‌లో ఆయన ప్రభుత్వ రంగ సంస్ధ మెకాన్ సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్‌లో వంద శాతం ప్రభుత్వ వాటాల అమ్మకానికి కేంద్రం నిర్ణయించిన తరుణంలో ఈయన నియామకం ఈ కార్యచరణను వేగవంతం చేసే అవకాశం ఉందని పరిశీలకుల అంచనా వేస్తున్నారు.
అతుల్ భట్ డిగ్రీ పూర్తి చేసిన తొలినాళ్లలో టాటా స్టీల్ లో ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించి ఆ సంస్ధల్లో కొన్నేళ్లు పని చేశారు. మిట్టల్ కంపెనీలో యూకెలో జిఎంగా, ఇరాన్ తదితర దేశాల్లోనూ పనిచేసి పలు కంపెనీల మెర్జింగ్ వ్యవహారంలో కీలకమైన అనుభవాన్ని సంపాదించారు.
ఇదీ చదవండి: STEEL PLANT: 'విశాఖ ఉక్కుపై పునరాలోచించాలి'