విశాఖ జిల్లా పెందుర్తిలోని గోకుళదామ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. కాలనీకి చెందిన లక్ష్మీ, ఆమె కుమార్తె గిరిజా ప్రసన్నరాణి ఆత్మహత్యాయత్నం చేశారు. వాటర్ క్యాన్లు తెచ్చే వ్యక్తి తలుపు కొట్టగా స్పందించలేదు. అనుమానం వచ్చి చుట్టుపక్కల వారికి తెలిపాడు. వారు తలుపులు తెరిచి చూడగా తల్లీ, కుమార్తె స్పృహ కోల్పోయి ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే కేజీహెచ్‌కు తరలించగా.. మార్గమధ్యలో తల్లి లక్ష్మీ మృతి చెందింది. కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. పెందుర్తి ఎస్ఐ శ్రీనివాస్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి.