ఒక పక్క పరవాడ ఫార్మసీ, మరో వైపు అచ్యుతాపురం పారిశ్రామిక వాడ... నిత్యం వందలాది వాహనాలు తిరిగే రహదారి. ఈ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. అచ్యుతాపురం కూడలికి ఇటు అటు రెండు కిలోమీటర్ల మేర గుంతలు పడ్డాయి. వీటి వల్ల వాహనాలు కదల్లేక పోతున్నాయి. పరవాడ నుంచి ఎలమంచలి వరకు రోడ్ నిండా ఇలాగే గతుకులు... వాహనదారులను ఇబ్బంది పెడుతున్నాయి. ద్విచక్రవాహనదారులు అయితే ఈ రోడ్డులో రావడానికి హడలిపోతున్నారు.
ఇదీ చదవండి: