విశాఖలో పల్లా శ్రీనివాసరావు భవనం కూల్చడాన్ని ఖండిస్తున్నామని అచ్చెన్నాయుడు అన్నారు. నోటీసులు ఇవ్వకుండా భవనాన్ని కూల్చడం దారుణమని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఇంట్లో మనుషులు లేని సమయం చూసి దొంగలు పడతారని విమర్శించారు. కోర్టు సెలవురోజే తెదేపా నేతల ఇళ్లు, భవనాలు కూల్చివేస్తున్నారని ఆరోపించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పల్లా దీక్ష చేశారన్నారు. పల్లాపై వైకాపా ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు దుర్మార్గమని మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదు.. తగిన మూల్యం చెల్లించక తప్పదని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
ఇదీ చదవండి: విశాఖలో తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు భవనం కూల్చివేత