గతంలో మాదిరిగా గిరిజనుల నుంచి మావోయిస్టులకు సహాయం అందడం లేదని ఏఎస్‌పీ తుహీర్ సిన్హా చెప్పారు. అందరిలో చైతన్యం వచ్చిన కారణంగా.. గిరిజనులు మావోయిజం వైపు వెళ్లడం లేదని అన్నారు. మావోయిస్టులకు సహకరించి ఎవ్వరూ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఏఎస్‌పీ సూచించారు.
మొబైల్ సంకేతాలు లేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు ఏఎస్‌పీకి విన్నవించారు. అనంతరం బూదరాళ్లు - పెదవలస రహదారిని ఆయన పరిశీలించారు. గ్రామంలో సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఏఎస్‌పీ చెప్పారు. అనంతరం స్థానిక యువకులకు వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు.
ఇదీ చదవండి: