కరోనా విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న తమకు పీపీఈ కిట్లు పంపిణీ చేయాలని ఆశా కార్యకర్తలు డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం వేములపూడి గ్రామ సచివాలయం వద్ద ఆందోళన చేపట్టారు. అంతేకాక మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతన బకాయిలు చెల్లించాలని కోరారు. 50 లక్షల వరకు బీమా సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తల సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: మన్యంలో మారని పరిస్థితులు... ఆసుపత్రికి వెళ్లాలంటే డోలీనే దిక్కు