ETV Bharat / state

ELECTIONS: ఎన్నికలకు సర్వం సిద్దం.. పటిష్ఠ బందోబస్తుకు ఏర్పాట్లు - vishaka district latest news

భీమునిపట్నం మండలం రేఖవానిపాలెం సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల ప్రచార పర్వం నిన్నటితో ముగిసింది. సర్పంచ్ పదవికి 4 గురు అభ్యర్థులు పోటీ పడుతుండగా... 10 వార్డుల్లో 2 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.

ఎన్నికలకు సర్వం సిద్దం
ఎన్నికలకు సర్వం సిద్దం
author img

By

Published : Nov 13, 2021, 7:58 PM IST

విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం రేఖవానిపాలెం సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పంచాయతీలో అభ్యర్థులు ఎన్నికల ప్రచారం చేయకూడదని.. 144 సెక్షన్ అమల్లో ఉందని పోలీసులు తెలిపారు. అంతేగాక ఒకేచోట జనం గుంపులుగా ఉండకూడదని పోలీసులు హెచ్చరించారు. సర్పంచ్ పదవికి నలుగురు అభ్యర్థులు పోటీ పడుతుండగా.. 10 వార్డుల్లో 2 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 8 వార్డుల్లో 17 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహిస్తామని రిటర్నింగ్ అధికారి మహేష్ తెలిపారు.

వాలంటీర్లను ఎన్నికల విధుల్లో బాధ్యతలు అప్పగించలేదన్న ఆయన.. భీమిలి సీఐ జి.వి. రమణ అధ్వర్యంలో ప్లైయింగ్ స్వ్కాడ్స్ ,రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ పోర్స్, ఎలక్షన్ అఫ్ ట్రైనింగ్ తో పాటు సుమారు 40 సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

రేపు తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ భేటీ.. ఏపీ అజెండా ఏంటంటే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.