విశాఖ జిల్లాలోని అరకు లోయ పర్యటకులతో కళకళలాడుతోంది. కరోనా భయం ఉన్నప్పటికీ.. వారాంతపు రోజుల్లో లోయ అందాలను తిలకించేందుకు సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్న కారణంగా.. ఆ ప్రాంతమంతా సందడిగా కనిపిస్తోంది.
నెలన్నర నుంచి వారాంతపు రోజుల్లో సుమారు 40 వేల మంది పర్యటకులు అరకును సందర్శించిన కారణంగా.. అక్కడి అతిథి గృహాలు నిండిపోయాయి. ఫలితంగా.. సందర్శకులు టెంట్ల వంటి ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. నెల రోజుల్లో గిరిజన మ్యూజియంకి సుమారు రూ. 12 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
ఎమ్మెల్యే వెలగపూడి స్థలం ఆక్రమించుకోవడంపై తెదేపా నేతల మండిపాటు