రేపటి నుంచి ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ సేవలు ప్రారంభమవుతాయని విశాఖ ఆర్ఎం ఎంవై.దానం తెలిపారు. బస్ స్టేషన్ నుంచి 10 కిలోమీటర్ల వరకు డోర్ డెలివరీ సర్వీస్ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. మార్కెట్ ధరల కంటే తక్కువకే ఈ సదుపాయం కల్పిస్తున్నట్టు వివరించారు.
ఛార్జీల వివరాలు
ఆర్టీసీ డోర్ డెలివరీ సర్వీసు ఛార్జీ కేజీ లోపు ఉన్న వస్తువులకు రూ.15గా నిర్ణయించారు. 1 నుంచి 6 కేజీల వరకు రూ.25లను ఛార్జీ చేయనున్నారు. అదే విధంగా 6 నుంచి 10 కేజీల వరకు రూ.30లను సర్వీస్ ఛార్జీగా నిర్ణయించారు.
ఇదీ చదవండి: