ETV Bharat / state

విశాఖలో ఉత్తమ కాలనీల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం

ఆనంద ట్రస్ట్, రాష్ట్ర నివాసితుల సంఘాల సమాఖ్య.. విశాఖలో ఉత్తమ కాలనీల ఎంపిక పోటీకి.. దరఖాస్తులు ఆహ్వానించాయి. మార్చి 31 లోగా దరఖాస్తులు పంపాలని కోరాయి.

application invited for visakha best colonies awards in visakhapatnam
విశాఖలో ఉత్తమ కాలనీల దరఖాస్తుకు ఆహ్వానం
author img

By

Published : Feb 5, 2020, 8:14 PM IST

విశాఖలో ఉత్తమ కాలనీల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం

విశాఖలో ఉత్తమ కాలనీల ఎంపికకు ఆనంద ట్రస్ట్, రాష్ట్ర నివాసితుల సంఘాల సమాఖ్య.. సంయుక్తంగా దరఖాస్తులు ఆహ్వానించాయి. పచ్చదనం- పరిశుభ్రత, తడి పొడి చెత్త వేరు చేయడం, కంపోస్టింగ్, కాలనీ పార్క్ నిర్వహణ అంశాలను ఈ పోటీలో పరిగణలోకి తీసుకుంటామని సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఏవీ రమణరావు తెలిపారు. నగరంలోని అన్ని జోన్లలో నిర్వహించనున్న పోటీల్లో ప్లాటినం పురస్కారం కింద రూ.55,000 స్వర్ణ పురస్కారం కింద రూ.40,000, రజత పురస్కారం కింద 30 వేలు, ప్రత్యేక బహుమతి కింద రూ.25000 నగదు బహుమతులు అందజేయనున్నారు. మార్చి 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, కాలనీ పురోగతి అంశాలను సెప్టెంబరు 30వ తేదీలోగా తెలియజేయాలని కోరారు. నవంబర్​లో పురస్కారాలు ప్రదానం చేస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:

పెళ్లికొచ్చారు.. పర్యావరణ సేవకులుగా మారారు

Intro:కిట్ నం:879,విశాఖ సిటీ, ఎం.డి.అబ్దుల్లా.
ap_vsp_71_05_visakha_best_colony_awards_ab_AP10148

( ) విశాఖ నగరంలోని నివాసిత కాలనీల్లో జీవన పరిస్థితులు మెరుగు పరిచేందుకు ఆనంద ట్రస్ట్, ఆంధ్రప్రదేశ్ నివాసితుల సంఘాల సమాఖ్య సంయుక్తంగా ఉత్తమ కాలనీల పురస్కారాలు ప్రదానం చేయనున్నాయి. ముఖ్యంగా పచ్చదనం- పరిశుభ్రత, తడి పొడి చెత్త వేరు చేయడం, కంపోస్టింగ్, కాలనీ పార్క్ నిర్వహణ అంశాలను ఈ పోటీలో పరిగణలోకి తీసుకుంటామని సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఏవి రమణరావు తెలిపారు.

Body:నగరంలోని అన్ని జోన్లలో నిర్వహించనున్న పోటీల్లో ప్లాటినం పురస్కారం కింద 55000, స్వర్ణ పురస్కారం కింద 40000, రజిత పురస్కారం కింద 30 వేల రూపాయలు, ప్రత్యేక బహుమతి కింద 25 వేల రూపాయలు నగదు బహుమతులు అందజేయనున్నారు.

Conclusion:పోటీలో పాల్గొనేందుకు ఈ ఏడాది మార్చి 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, కాలనీ పురోగతి అంశాలను సెప్టెంబరు 30వ తేదీలోగా తెలియజేయాలని కోరారు. ఈ పురస్కారాలను నవంబర్ లో నిర్వహించే కార్యక్రమంలో ప్రధానం చేస్తామని రమణారావు వివరించారు.

బైట్:ఎ.వి.రమణారావు, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ నివాసితుల సంఘాల సమాఖ్య.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.