ఎర్రగా ఊరిస్తుంది కదా అని యాపిల్ అనుకొని తింటే వగరును రుచి చూపిస్తోంది. పోనీ టమాటా అనుకుందామంటే పులుపు లేదాయే. అయినప్పటికీ రుచిలో నేనే మెండు.. కూరగాయాల్లో నేనే కింగు అంటుందీ కొత్త వంగడం. విశాఖ మన్యంలోని హుకుంపేట మండలంలో దర్శనమిచ్చిన ఈ కొత్తరకం కూరగాయ చూడటానికి యాపిల్ ఆకారంలో... పైన కుచ్చుతో టమాటాను తలపిస్తూ జనాలను ఇట్టే ఆకట్టుకుంటుంది.
కుంతుర్ల అనే గ్రామ రైతులు... గుంటూరు నుంచి తెచ్చిన కొత్తరకం విత్తనాలతో పంట వేశారు. వాటి దిగుబడి చూస్తే ఆశ్చర్యమేసిందా రైతులకు. యాపిల్ వంటి ఆకారం కలిగి ఎర్ర రంగు ఉన్న వంకాయ దర్శనమిచ్చింది. చూసేవారికి చెబితే గానీ అసలు అది వంకాయనే విషయం తెలియదు.
గుంటూరు నుంచి తెచ్చిన యాపిల్ వంకాయ విత్తనాలను సేంద్రియ పద్ధతుల్లో పండించినట్లు రైతు చెప్పాడు. సంతలో యాపిల్ వంకాయను చూసిన వ్యాపారులు, ప్రజలు ఆసక్తిగా తిలకించారు. దీనిపై అధికారులు మరింత దృష్టి పెడితే మరింత మంది ఈ వంకాయలను సాగు చేస్తారని అభిప్రాయపడుతున్నారీ రైతులు.
ఇవీ చూడండి...