హలో జగనన్నయ.. మా ఏజెంట్ పేరు లక్ష్మణరావు. మాది పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం కేసముద్రపుగట్టు. ఆ లక్ష్మణరావు అక్కడున్న ఆడవాళ్లకు మంచిదని చెప్పి.. అవీ.. ఇవీ చెప్పి.. కువైట్ పంపిస్తున్నాడు. ఇక్కడ ఆఫీసుంది. సహరా మేడమ్ దాని పేరు. దానికి పంపిస్తున్నాడు. అదేమో.. మమ్మల్ని కువైట్ సేట్లకు అమ్మెస్తోంది. నానా టార్చర్ పెడుతుంది. మమ్మల్ని ఎవరు సేవ్ చేస్తారన్న..? ఎట్లా బయటపడాలో అర్థం కావడం లేదు. మా వాయిస్, మా వీడియో విన్న తర్వాత.. మీరే మమ్మల్ని ఆదుకోవాలన్న.
ఏం చేయాలన్న ఇక్కడ వందల మంది అక్కలు, చెల్లెలు ఉన్నారన్న. అందరూ గొల్లున ఏడుస్తున్నారన్న. కువైట్లోని ఇండియా ఎంబసీలో ఉన్నామన్న మేం అందరం. ష్ ష్ ... మెల్లగా మాట్లాడండి.. అయ్యో దేవుడా.. అందరం దొరికిపోతాం. ఫోన్ ఏదో అక్క ఇస్తే మాట్లాడుతున్నం. మమ్మల్ని ఎలా విడుదల చేస్తారన్నా..? రెండు వందల మందిమి ఉన్నామన్న. ఆ ఆఫీస్లో మాకు పాస్పోర్ట్ ఇవ్వొద్దని చెబుతున్నారు. మేం ఇక్కడి నుంచి ఎట్లా బయటపడాలి జగనన్న..?
ఈ వీడియో రికార్డింగ్ ద్వారా మమ్మల్ని ఆదుకోవాలన్న. మా ఏజెంట్, మమ్మల్ని మోసం చేసేవాళ్ల పని చెప్పాలన్నా. నీ రూపంలో మాకు దేవుడొచ్చాడు అనుకుంటున్నామన్న. అరబుల ఇంట్లో నలిగిపోతున్నామన్న. ఇండియా ఆడపడుచులం నరకం చూస్తున్నామన్నా. ఆరేసి నెలలు ఎంబసీ దగ్గరే ఉండిపోతున్నామన్న. మన తెలుగొళ్లు ఉన్నా పట్టించుకోవడం లేదన్న. కువైట్ ఇండియా ఎంబసీలో ఉన్నామన్న. నీ చెల్లెల్లం అన్నయ్య. నీకు దండం పెడతామన్న మమ్మల్ని కాపాడు.
మీ ఏజెంట్ల పేరు చెప్పు..అని వీడియోలో మాట్లాడిన తల్లి చెప్పగానే.. రక్షించండి అంటూ.. మిగతా మహిళలు ఇలా చెప్పుకొచ్చారు.
మా ఏజెంటు పేరు గుత్తుల శ్రీను అన్నా. మమ్మల్ని రక్షించు. పిల్లలతో ఉన్న. భర్త లేనిదాన్ని.. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నా.. త్వరగా రక్షించు..!
మా ఏజెంట్ పేరు ప్రకాశ్ రాజ్ అన్న. వాడిది ఈతకోట. మాది కొత్తపేట. మూడు లక్షలకు నన్ను అమ్మేశాడన్న. నాది చిత్తూరు జిల్లా వెంకటగిరి అన్న. రేపల్లే గ్రామం. మమ్మల్ని ఎట్లైనా రక్షించన్నా.. మాకు పాస్ పోర్టు ఇవ్వకుండా దారుణంగా చూస్తున్నారు. మమ్మల్ని సేవ్ చేయన్నా.
ఉపాధి కోసం ఊరు దాటిన ఆ ఆడపడుచుల బాధ అంతా ఇంతా కాదు. హీనంగా చూస్తున్నారంటూ... వాళ్లు వేడుకుంటున్న తీరు వింటుంటే.. ఏంటీ ఇలా కూడా ఉంటుందా..? అనిపిస్తోంది. ఇలాంటి మన రాష్ట్ర తల్లులు కువైట్లో 200 మంది ఉన్నారు. కనీసం బాధను పంచుకునేందుకు ఫొన్ ఉండదు. ఎలానో ఫోన్ సంపాందించి ఈ వీడియో పంపారు. అందరిదీ ఒకే బాధ మమ్మల్ని రక్షించు అని..!
ఇదీ చదవండి: 'బాలికతో టీచర్ అసభ్య ప్రవర్తన.. చితకబాదిన తల్లిదండ్రులు'