విశాఖ మన్య కేంద్రం పాడేరులో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలి ఉధృతంగా వీచటం వల్ల ఫ్లెక్సీలు ఎగిరిపోయాయి. సుమారు గంట పాటు వర్షం కురిసింది. పాడేరులో లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాలలో ఇదే అత్యధిక శాతంగా నమోదైంది. ఎండలకు బీడులైన మడుల్లో నీళ్లు చేరాయి.
ఇవీచదవండి