విశాఖ న్యాయవాదుల సంఘానికి సంబంధించి 2008 మంది న్యాయవాదులు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ప్రధానంగా జూనియర్ న్యాయవాదుల స్టైఫండ్ 5000 రూపాయలు సాధన, అధికంగా న్యాయవాదుల సంక్షేమ నిధి సమకూర్చుకోవడం, మృతి చెందిన న్యాయవాదులకు వెంటనే సంఘం తరుపు నుంచి 25 వేల రూపాయలు ఆర్థిక సహాయం సాధనకు కృషి చేస్తామని అభ్యర్థులు ప్రకటిస్తున్నారు. మహిళా న్యాయవాదుల విశ్రాంతి ప్రదేశాల కల్పన, పార్కింగ్ తదితర మౌలిక సదుపాయాలు సమకూర్చుకునేందుకు కృషి చేస్తామన్నారు.
ఇవీ చదవండి