విశాఖ కలెక్టరేట్ లో జరిగిన మీకోసం కార్యక్రమంలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, జేసీ సృజన ఆధ్వర్యంలో ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా విశాఖ ఈఎన్టీ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో ఓ కుటుంబానికి ఎదురైన ఇబ్బందులపై వచ్చిన ఫిర్యాదుకు కలెక్టర్ వెంటనే స్పందించారు. అనారోగ్య సమస్యతో కొద్ది నెలల క్రితం సాయివంశీ అనే బాలుడిని కేజీహెచ్ లో చేర్చారు. అక్కడ వెంటిలేటర్ పై చికిత్స అందించిన తరువాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైనందున సాయి వంశీని ఈఎన్టీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు బాలుడికి శ్వాసనాళంలో గొట్టం అమర్చి చికిత్స చేశారు. నాలుగు నెలలు ఉంచిన తరువాత పరికరం తీసివేయాలని వైద్యులు సూచించారు. తీరా 4 నెలల తరువాత వైద్యులను ఆశ్రయించిన తల్లిదండ్రులకు నిరాశ ఎదురైంది. ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రిలో గొట్టం తీసేందుకు అవసరమైన పరికరాలు లేవని వైద్యులు చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రికి వెళితే కనీసం 3లక్షలు ఖర్చవుతుందని చెబుతున్నారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సహకారం అందించి సాయి వంశీని కాపాడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
శ్వాసనాళంలో పరికరం అమర్చారు.. తీయలేక చేతులెత్తేశారు
కేజీహెచ్ వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న ఓ యువకుడి శ్వాసనాళంలో పరికరం అమర్చారు. నాలుగు నెలల తరువాత అది తీసివేయాల్సి ఉండగా.. తమ వద్ద వైద్యపరికరాలు లేవని చేతులెత్తేశారు.
విశాఖ కలెక్టరేట్ లో జరిగిన మీకోసం కార్యక్రమంలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, జేసీ సృజన ఆధ్వర్యంలో ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా విశాఖ ఈఎన్టీ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో ఓ కుటుంబానికి ఎదురైన ఇబ్బందులపై వచ్చిన ఫిర్యాదుకు కలెక్టర్ వెంటనే స్పందించారు. అనారోగ్య సమస్యతో కొద్ది నెలల క్రితం సాయివంశీ అనే బాలుడిని కేజీహెచ్ లో చేర్చారు. అక్కడ వెంటిలేటర్ పై చికిత్స అందించిన తరువాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైనందున సాయి వంశీని ఈఎన్టీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు బాలుడికి శ్వాసనాళంలో గొట్టం అమర్చి చికిత్స చేశారు. నాలుగు నెలలు ఉంచిన తరువాత పరికరం తీసివేయాలని వైద్యులు సూచించారు. తీరా 4 నెలల తరువాత వైద్యులను ఆశ్రయించిన తల్లిదండ్రులకు నిరాశ ఎదురైంది. ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రిలో గొట్టం తీసేందుకు అవసరమైన పరికరాలు లేవని వైద్యులు చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రికి వెళితే కనీసం 3లక్షలు ఖర్చవుతుందని చెబుతున్నారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సహకారం అందించి సాయి వంశీని కాపాడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
Body:నరసన్నపేట
Conclusion:9440319788