- వైసీపీలో అంతర్యుద్దం.. విధ్వంసాల సంవత్సరంగా 2022 : చంద్రబాబు
CHANDRABABU FIRES ON CM JAGAN : రాష్ట్రం గంజాయి హబ్‌గా మారి మహిళలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. గంజాయి, డ్రగ్స్ నివారణపై సీఎం శ్రద్ధ పెట్టట్లేదని.. ఈ మూడున్నరేళ్లలో 53 వేల మందికి పైగా మహిళలపై అఘాయిత్యాలు జరిగాయని పేర్కొన్నారు. సంపద సృష్టించే యువశక్తి రాష్ట్రంలో నిర్వీర్యమైపోయిందని ఆక్షేపించారు. నిరుద్యోగుల్లో నిరుత్సాహం, నిస్సహాయత నెలకొన్నాయన్నారు. అధికార పార్టీలోనూ అంతర్యుద్దం మొదలైందని బాబు పేర్కొన్నారు.
- పార్కులు ఏం చేశాయ్..! పూర్తి కావచ్చిన ఉద్యానవనాలనూ పట్టించుకోని ప్రభుత్వం
Unfinished Parks: ప్రజల ఆహ్లాదం, ఆనందం కోసం అక్కడ ఉద్యానవనాలు నిర్మించేందుకు కోట్లు ఖర్చుపెట్టారు. నిర్మాణాలు దాదాపు 90 శాతం పూర్తయ్యాయి. ఈలోగా ప్రభుత్వం మారింది. వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చింది. మూడున్నరేళ్లు గడిచినా వాటిపై దృష్టిపెట్టకపోవడంతో ప్రజలకు అందుబాటులోకి రాకుండా నిరుపయోగంగా పడిఉన్నాయి. ఎంతో వ్యయంతో నిర్మితమై.. సర్వాంగ సుందరంగా ముస్తాబైన పార్కులు వాటి శోభను కోల్పోయి వెలవెలబోతున్నాయ. ఇదీ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పార్కుల పరిస్థితి.
- "అమ్మో! సీఎం జగన్ పర్యటనా.." హడలెత్తుతున్న ప్రజలు, ప్రతిపక్షాలు
Cm Jagan Anakapally Tour : ముఖ్యమంత్రి ఏదైనా ప్రాంతంలో పర్యటిస్తున్నాడు అంటే ముందస్తుగా.. ఆ ప్రాంత ప్రతి పక్షనాయకులను అదుపులోకి తీసుకోవటం మాములైపోయింది. సీఎం పర్యటన అంటే హంగులు, ఆర్భాటలే కాకుండా.. ఆర్టీసీ బస్సులను సభ కోసం తరలిస్తున్నారు. దీంతో ప్రయాణికులు దీని వల్ల సమస్యలు ఎదుర్కోంటున్నారు.
- రైలు టిక్కెట్లు అయిపోయాయి..! బస్సుల్లో ఛార్జీల బాదుడు..! సంక్రాంతికి ఊరెలా..!
BUS RESERVATIONS FULL : సంక్రాంతి పండుగకు రైల్లో సొంతూరు వెళ్దామనుకుంటున్నారా.. టికెట్ రిజర్వేషన్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారా.. అయితే మీ ప్రయత్నం విరమించుకోవడం మంచిది. ఎందుకంటే మీ ఊరెళ్లే ఏ రైళ్లోనూ బెర్తులు ఖాళీగా లేవు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లే రైళ్లన్నింటిలోనూ బెర్తులు నిండిపోయాయి.
- చంపుతానని హెచ్చరించిన భర్త.. భయంతో భర్తనే చంపేసిన భార్య
Husband Murderd By Wife: భర్త అర్ధరాత్రి వరకు గొడవ జరగడంతో తనపై అఘాయిత్యానికి పాల్పడతారని భయంతో ఆమె కర్రతో తలపై మోదింది. అతను అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన శ్రీ సత్య సాయి జిల్లాలో జరిగింది.
- దెయ్యాల ముసుగులతో శ్మశానంలో కొత్త ఏడాది వేడుకలు
పంజాబ్ అమృత్‌సర్‌లో కొత్త ఏడాదికి వినూత్నంగా స్వాగతం పలికారు. వికృత రూపాలతో ఉన్న మాస్క్‌లను ముఖానికి ధరించిన యువకులు శ్మశానంలోని ఓ ఊడలమర్రికి వేలాడారు. సమాధుల చుట్టూ తిరుగుతూ పాటలు పాడారు. నృత్యాలు చేస్తూ కేరింతలు కొట్టారు. తర్వాత ఓ సమాధి వద్ద కేక్‌కట్ చేసి వేడుకలు జరుపుకొన్నారు.
- ఆవును దానం చేసేందుకు కెనడా నుంచి కర్ణాటకకు.. కోరిక నెరవేరినందుకే..
కెనడా నుంచి మాదప్ప కొండకు మొక్కు తీర్చుకునేందుకు వచ్చారు దంపతులు. మహాదేశ్వర్ ఆలయానికి దూడను దానం చేశారు. ఈ సంఘటన కర్ణాటకలో జరిగింది.
- కొత్త ఏడాదికి 'ఆర్థిక' స్వాగతం.. భవిష్యత్తులో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!
నూతన సంవత్సర ఉషోదయం సమీపిస్తోంది. మంచి, చెడు జ్ఞాపకాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ.. కొత్తదనానికి స్వాగతం పలికేందుకు మనందరమూ సిద్ధం అవుతున్నాం. ఇప్పటి వరకూ ఏం చేశాం? మున్ముందు ఏం చేయాలి? ఇలా ఎన్నో ప్రశ్నలు. ఎటు చూసినా.. సమాధానం మాత్రం డబ్బు అనే వస్తుంది. ఇప్పటికే మన దగ్గర ఉన్న సొమ్మును సరిగ్గా నిర్వహించాలి.
- Cristiano Ronaldo: మరోసారి జెర్సీ పట్టుకున్న రొనాల్డో..కారణమేంటంటే..!
మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌తో బంధాన్ని తెంచుకున్న ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో.. తన కెరీర్లోనే అత్యంత విలువైన ఒప్పందాన్ని చేసుకున్నాడు. రూ.4400కోట్లకు సౌదీ అరేబియా క్లబ్‌తో జట్టు కట్టాడు.
- ప్రాజెక్ట్-K నుంచి క్రేజీ అప్డేట్.. స్క్రాచ్ నుంచి వచ్చిన టైర్.. వీడియో అదుర్స్!
మహానటి, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాల దర్శకుడు నాగ్ అశ్విన్.. ప్రాజెక్ట్-కె మూవీలోని ఓ వీడియోను తాజాగా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరలవుతోంది.