- అత్తాకోడళ్ల ఉరుసు తీసిన రుణ వేధింపులు
సొంతింటి కళ నెర్చుకోవాలని ఓ కుటుంబం ప్రైవేట్ సంస్థ నుంచి రుణం తీసుకోవడం వల్ల..వాళ్లు కన్న కలలన్నీ ఆవిరైపోయాయి.. ఓ నెల వాయిదా.. సమయానికి చెల్లించలేదని.. సంస్థ అధికారుల వేధింపులు ..ఆ కుటుంబంలో ఇద్దరు మహిళలు మరణానికి దారితీసాయి..
- తెలుగు భాష పరిరక్షణకు "లిపి డాట్ గేమ్".. ఆవిష్కరించిన విశాఖ వాసి
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు భాషను బతికించుకునే విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ది చెందిన వాటిని వినియోగించుకునేందుకు టెక్నో క్రాట్స్ ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఈ తరహా ఉపకరణాలు ఆంగ్ల భాషలో విస్తృతంగా వాడకంలో ఉన్నాయి. విశాఖ నుంచి అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడిన సాగర్ అనిసింగరాజు.. దీని కోసం ప్రత్యేకంగా.. "లిపి డాట్ గేమ్" అన్న దాన్ని రూపొందించారు.
- టీ కాంగ్రెస్‌లో ఏడాదిన్నరగా ఎవరికి వారే.. సిద్ధమైన దిగ్విజయ్‌సింగ్ నివేదితెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌లో నాయకుల మధ్య రాజుకున్న వివాదానికి తెరదించేందుకు దిగ్విజయ్‌సింగ్ నివేదిక సిద్ధమైంది. రేవంత్‌రెడ్డి, సీనియర్ నేతల మధ్య విభేదాలు సద్ధుమణిగేందుకు పలు ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు ఈ నివేదిక అందించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. నేతలు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తుండటంతో.. ఇప్పటికే పార్టీకి చాలా నష్టం జరిగిందని.. తక్షణం చికిత్స అవసరమని ఐదు అంశాలతో నివేదికను తయారు చేశారని సమాచారం.
- పెట్టుబడుల సమీకరణే లక్ష్యంగా.. తెలంగాణలో విదేశీ పారిశ్రామిక పార్కులు
తెలంగాణలో పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులను ఆకట్టుకునేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా దేశాల పేరిట ప్రత్యేక విదేశీ పార్కులు ఏర్పాటు చేయనుంది. తొలిదశలో 10 దేశాల పార్కులను అందుబాటులోకి తెచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించి భూముల ఎంపిక ప్రక్రియ కూడా ప్రారంభమైంది.
- మహాత్మా గాంధీ సహా మాజీ ప్రధానులకు రాహుల్ గాంధీ నివాళి
భారత్ జోడో యాత్రకు రాహుల్ గాంధీ స్వల్ప విరామం తీసుకున్నారు. దిల్లీ చేరుకున్న ఆయన సోమవారం ఉదయం మహాత్మా గాంధీ సహా పలువురు మాజీ ప్రధానులకు నివాళులు అర్పించారు. జనవరి 3న తిరిగి భారత్ జోడో యాత్ర ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. భాజపా నేత, మాజీ ప్రధాని వాజ్‌పేయీకి కూడా రాహుల్‌గాంధీ నివాళులర్పించారు.
- సరిహద్దులో పాక్ డ్రోన్ కూల్చివేత.. వారం రోజుల్లో మూడోసారి..
పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్.. భారత్ గగనతలంలోకి ప్రవేశించడం కలకలం రేపింది. పంజాబ్ అమృత్సర్ జిల్లాలో చక్కర్లు కొడుతున్న పాక్ డ్రోన్‌పై బీఎస్ఎఫ్ కూల్చివేసింది. అనంతరం ఆ డ్రోన్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
- ఆ దేశాల్లో 'చిల్లీ' సాస్‌కు ఫుల్ డిమాండ్.. కొవిడ్ రోగులకు మంచి ఫుడ్ అదే!
అధిక ఉష్ణోగ్రతలు, కరవు కారణంగా ఈ ఏడాది ప్రారంభంలో ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో హాట్ చిల్లీసాస్‌కు కొరత ఏర్పడింది. దీంతో కీలకమైన ఈ ఆహార పదార్థాన్ని నిల్వ చేసుకోవడానికి ఎగబడ్డారు. ఎంత ఘాటుగా ఉన్నప్పటికీ ఆహారంలో మిర్చి తగలనిదే కొందరికి అనుభూతి ఉండదు. వాసన, రుచి సామర్థ్యాన్ని కోల్పోయే కొవిడ్-19 బాధితులు కూడా మిరప సాయంతో పూర్వవైభవాన్ని పొందే వీలుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
- డాలరుపై తిరుగుబాటు.. ప్రత్యామ్నాయం దిశగా ప్రపంచ దేశాలు
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో శక్తిమంతంగా ఉన్న డాలరు ప్రభావం క్రమంగా తగ్గుతుంది. డాలరు ప్రత్యామ్నాయం కోసం అనేక దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనికి గల కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
- IND Vs BAN: 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' పుజారాకు ఎందుకిచ్చారబ్బా.. మరి శ్రేయస్?
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల మ్యాచ్‌లో 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్'గా పుజారాను ఎంపిక చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలు..
- అబ్బో అల్లు అరవింద్-సుక్కులో ఈ యాంగిల్ కూడా ఉందా.. యంగ్ బ్యూటీతో కలిసి రచ్చ!
ప్రముఖ నిర్మాత అల్లుఅరవింద్, దర్శకుడు సుకుమార్ ఓ యంగ్ బ్యూటీ హీరోయిన్‌తో కలిసి చిందులేస్తూ రచ్చ చేశారు. దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మీరూ చూసేయండి..