ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 7 AM - ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

..

AP TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు
author img

By

Published : Dec 18, 2022, 7:01 AM IST

Updated : Dec 18, 2022, 7:57 AM IST

  • దేశ రాజధానిలో అమరావతి రైతుల నిరసన.. మద్దతు తెలిపిన పలు పార్టీల నాయకులు
    అమరావతినే రాష్ట్రానికి ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్​ చేస్తూ ఆ ప్రాంత రైతులు దేశ రాజధాని దిల్లీలో నిరసన చేపట్టారు. ‘ధరణికోట నుంచి ఎర్రకోట’ అనే నినాదంతో ధర్నాకు దిగారు. రైతుల నిరసనలకు పలు జాతీయ పార్టీల నాయకులు తమ మద్దతు తెలిపారు. అమరావతే రాష్ట్రానికి రాజధానిగా ఉంటుందని ఏకకంఠంతో స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఇంకా ఆరని మాచర్ల విధ్వంసం మంటలు.. నివురుగప్పిన నిప్పులా పల్నాడు..
    పల్నాడు జిల్లా మాచర్లలో వైసీపీ రాజేసిన విధ్వంసపు సెగలు ఇంకా ఆరలేదు. పట్టణంలో ప్రస్తుతం అల్లర్లు జరగకపోయినా.. పరిస్థితి మాత్రం నివురుగప్పిన నిప్పులానే ఉంది. అటు శుక్రవారం నాటి ఘటనల్ని తలచుకుని బాధితులు వణికిపోతున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన సాధారణ ప్రజల్లోనూ నెలకొంది. ఇప్పటి వరకు విధ్వంసంపై ఎవరూ ఫిర్యాదు చేయలేదన్న పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి.. భారీగా బలగాలను మోహరించినట్లు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అనంత వైసీపీలో అసమ్మతి సెగలు.. ఏకంగా మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్‌పైనే చెప్పులు
    ఉమ్మడి అనంతపురం జిల్లాలో అధికార వైకాపాలో అసమ్మతి సెగలు ఎగిసిపడుతున్నాయి.మంత్రి పెద్దిరెడ్డి నిర్వహిస్తున్న నియోజకవర్గాల విస్తృతస్థాయి సమావేశాల్లో, అసమ్మతి వర్గం తమకు జరుగుతున్న అన్యాయంపై నిలదీస్తోంది. పుటపర్తిలో ఏకంగాపెద్దిరెడ్డి కాన్వాయ్‌పైనే అసమ్మతివర్గం చెప్పులు విసిరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఎస్సీ, ఎస్టీలకు దగా.. ఏళ్లుగా సాగుతున్న పథకాలకు పాతర
    ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై లక్ష కోట్లకుపైగా ఖర్చు చూపిస్తున్న జగన్‌ సర్కార్‌.. అందరికీ ఇస్తున్న నవరత్న పథకాలే అమలు చేస్తూ.. వారిని దగా చేస్తోంది. దశాబ్దాలుగా ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి అమలవుతున్న పథకాలకు.. జగన్‌ సీఎం అయ్యాక పాతరేశారు. ఈ అన్యాయంపై పలు ఎస్సీ, ఎస్టీ సంఘాలు.. దళిత్‌ గిరిజన ఐకాసగా ఏర్పడి గళమెత్తుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా విజయవాడ కేంద్రంగా నేడు రాష్ట్ర స్థాయి ఐకాస సదస్సు నిర్వహిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి
  • ఈ రైలు ప్రయాణం చాలా కాస్ట్‌లీ.. టికెట్​ రేటే రూ.19 లక్షలు.. మన దేశంలోనే!
    రైలు ప్రయాణమంటే తక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దూర ప్రాంతాలకు.. అదీ ఏసీ బోగీలో అయితే ఓ ఐదువేల రూపాయలుంటే సరిపోతుంది. అదే విమానంలో అయితే, ఓ రూ.పదివేలు పెట్టాలి. బిజినెస్‌ క్లాస్‌ అయితే ఇంకాస్త ఖరీదు ఉంటుంది. కానీ రైలు టికెట్టే రూ.లక్షల్లో ఉందంటే అంటే నమ్మగలరా? అదీ మన భారత్‌లో? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం! ఐఆర్‌సీటీసీకి చెందిన ఈ మహారాజా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాలంటే రూ.లక్షల్లో వెచ్చించాల్సిందే. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి
  • కిడ్నాప్​ చేసి రేప్​​ చేశాడని బాలిక​ ఫిర్యాదు.. నిందితుడు 'అతడు' కాదు 'ఆమె'.. పోలీసులు షాక్​!
    తనను ఓ యువకుడు కిడ్నాప్​ చేసి రెండు రోజుల పాటు అత్యాచారం చేశాడని ఓ బాలిక పోలీసులకు​ ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో భాగంగా ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తాను కిడ్నాప్​ చేయడం నిజమేనని కానీ అత్యాచారం చేయలేదని అతడు చెప్పాడు. ఆ తర్వాత నిందితుడు అబ్బాయి కాదు, అమ్మాయి అని తేలింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా షాకై ఏం చేశారంటే? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'భూమిపై ఏలియన్లు.. అప్పుడప్పుడు వచ్చిపోయే సాసర్లు'.. అమెరికా ఏమందంటే?
    భూమిపై గ్రహాంతరవాసుల కదలికలపై ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని అమెరికా సైనిక అధికారులు తెలిపారు. ఇందుకోసం తాము వందలాది నివేదికలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆస్తి తనఖా పెట్టి రుణం తీసుకుంటున్నారా?.. వీటిని జాగ్రత్తగా పరిశీలించాల్సిందే!
    కలలను సాకారం చేసుకునేందుకు మనం పొదుపు చేసిన డబ్బు సరిపోకపోవచ్చు. అయితే అలాంటి సందర్భాలలో ఆస్తి తనఖా పెట్టి రుణాలను తీసుకోవడం అనివార్యం కావచ్చు. అయితే ఈ తరహా రుణాలను తీసుకునేటప్పుడు కొన్ని అంశాలను పరిశీలించడం తప్పనిసరి. మరి ఆ అంశాలేంటో తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆఖరి గోల్‌ నీదా.. నాదా! అర్జెంటీనా-ఫ్రాన్స్‌ మధ్య పోరు హోరాహోరీ​
    చిన్న జట్ల సంచలనాలు.. పెద్ద జట్ల పతనం.. స్టార్‌ ఆటగాళ్ల మెరుపులు.. యువ కెరటాల అద్భుతాలు.. అన్నీ చూశాం! అనిర్వచనీయ అనుభూతులతో ఉర్రూతలూగిపోయాం. ఇక ఆఖరి ఘట్టం కూడా అంచనాలకు తగ్గట్లు అద్భుతంగా సాగిపోతే 2022 టోర్నీ ఫుట్‌బాల్‌ ప్రేమికుల జ్ఞాపకాల్లో పదిలం! మరి 'మూడో' ముచ్చట తీర్చుకునే జట్టేది? 26 ఏళ్ల నిరీక్షణకు అర్జెంటీనా తెరదించుతుందా.. లేక వరుసగా రెండో కప్పును ఫ్రాన్స్‌ ఎగరేసుకుపోతుందా? కప్పు కలను నెరవేర్చుకుని మెస్సి సగర్వంగా నిష్క్రమిస్తాడా? ఎంబాపె ఖాతాలో మరో టైటిల్‌ చేరుతుందా? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

Last Updated : Dec 18, 2022, 7:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.