విశాఖ జిల్లాలోని సింహాచలం పంచగ్రామాల సమస్య పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి అధ్యక్షత వహించనున్నారు. సభ్యులుగా మంత్రి ముత్తంశెట్టి, ఎమ్మెల్యే అదీప్‌రాజు, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, విశాఖ కలెక్టర్ వినయ్ చంద్ వ్యవహరించనున్నారు. కార్యదర్శిగా సింహాచలం దేవస్థానం ఈవోను ప్రభుత్వం నియమించింది.
ఇదీ చదవండి : ''అన్నీ అక్రమాలే.. ఒప్పందాలు రద్దు చేయండి''