ETV Bharat / state

గిరిజనులకు నాలుగో విడత భూపంపిణీ..26వేల మందికి లబ్ధి - cm jagan

అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులకు అటవీ భూములు ఇచ్చే కార్యక్రమానికి పాడేరు ఐటీడీఏ శ్రీకారం చుట్టింది. అటవీ హక్కుల భూపంపిణీ చట్టం వచ్చిన తర్వాత నాలుగో విడతలో ఈ భూపంపిణీ జరగనుంది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆగస్టు 9నే పంపిణీ చేపట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టినా...కరోనా కారణాంగా అక్టోబరు 2కు వాయిదా వేశారు.

ap govt all are set for  Fourth time land distribution

author img

By

Published : Aug 11, 2020, 5:41 PM IST

గిరిజనులకు అటవీ భూములపై హక్కులు కల్పించేలా పట్టాల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విశాఖ జిల్లాలో పాడేరు, నర్సీపట్నం, విశాఖ అటవీ డివిజన్లు ఉండగా...వీటిలో సుమారు 40 శాతం అటవీ భూభాగం ఉంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు చాలాకాలంగా వీటిపై ఆధారపడుతూ...పోడు భూములుగా సాగు చేసుకుంటున్నారు.

మన్యం ప్రాంతంలోని కొండ భూములకు పట్టాలు లేవు. ఇందుకోసం 2005లో అటవీ భూములపై చట్టం చేశారు. అప్పట్నుంచి ఆ చట్టం గిరిజనులకు వరంగా మారింది. 2008వ సంవత్సరం చట్టం కార్యరూపం దాల్చటంతో... ఇప్పటివరకూ 3 విడతల్లో 85వేల ఎకరాలకు పట్టాలిచ్చారు. దీంతో 38 వేల మంది గిరిజనులు లబ్ధి పొందారు.

తాజాగా నాలుగో విడతలో భాగంగా 45వేల ఎకరాల్లో 26వేల మందికి అటవీ భూములపై హక్కులను కల్పించనున్నారు. ఈసారి కేవలం ఏజెన్సీ ప్రాంతాల్లోనే కాకుండా మైదాన ప్రాంతాల్లోనూ పట్టాలు ఇవ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి

రష్యా 'కరోనా వ్యాక్సిన్​' విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.