ETV Bharat / state

దంపతులు సెల్ఫీ తీసుకుని .. భార్యను చపాతి కర్రతో కొట్టి.. సముద్రంలో దూకి... - ఏపీ నేర వార్తలు

AP CRIME NEWS : ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంటున్నామని విశాఖలో సెల్ఫీ తీసుకోని బందువులకు పంపారు. మరో ఘటననలో భార్యను చపాతి కర్రతో కొట్టి ఆపై తాను సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వేరే రాష్ట్రానికి చెందిన ఇద్దరు కూలీలు క్వారీలో పనికి వచ్చిన 24 గంటల్లో మృతి చెందారు. విశాఖలో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Mar 28, 2023, 12:39 PM IST

దంపతులు సెల్ఫీ తీసుకుని

AP CRIME NEWS : ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ దంపతులు సెల్ఫీ వీడియో తీసుకున్న ఘటన విశాఖలో కలకలం రేపింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగి చిత్రాడ వర ప్రసాద్‌, ఆయన భార్య మీరా సెల్ఫీ వీడియో తీసి వారి పిల్లలకు, బంధువులకు పంపారు. ఈ వీడియోపై వారి కుమారుడు కృష్ణసాయి తేజ దువ్వాడ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనకాపల్లి కొప్పాక - ఏలూరు కాల్వ వద్ద చెప్పులు, హ్యాండ్‌ బ్యాగ్‌, మొబైల్ గుర్తించారు. కానీ దంపతులిద్దరి ఆచూకీ లభ్యం కాకపోవడంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు.

పూరి కర్రతో కొట్టడంతో...: ప్రకాశం జిల్లా ఒంగోలు విరాట్‌నగర్‌లో విషాదం జరిగింది. భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల కారణంగా భర్త అంజిరెడ్డి భార్య పూర్ణిమను చపాతి కర్రతో కొట్టాడు. ఆమెను ఆసుపత్రికి తరలించగా మృతి చెందింది. అనంతరం భర్త అంజిరెడ్డి కొత్తపట్నం వద్ద సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య : విశాఖలో ఓ ప్రైవేట్‌ కళాశాల వసతి గృహంలో ఉరేసుకుని ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థినిని సమీపంలోని ఆసుపత్రికి కళాశాల సిబ్బంది తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహం కేజీహెచ్‌ మార్చురీకి తరలించారు.

పనిలో చేరిన 24 గంటల్లో..: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కొత్తవలసలోని క్వారీలో రాళ్లు పడి ఇద్దకు కూలీలు మృతి చెందారు. ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి కి చెందిన సుజిత్‌, సోమ, పి. రాము కొత్తవలసలోని స్టోన్​ క్రషర్‌లో పనిలో చేరారు. పనిలో చేరి 24 గంటలు గడవక ముందే క్వారీలో రాళ్లు పడి ఇద్దరు అక్కడిక్కడే మరణించగా మరొకరికి గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రైతు ప్రాణం తీసిన అప్పులు : అప్పులు బాధ తట్టుకోలేక కౌలు రైతు బలవన్మరణానికి . పోలీసులు కథనం మేరకు గుంటూరు జిల్లా మేడి కొండూరు మండలం వరగానికి చెందిన వీరయ్య(35) వ్యవసాయం చేస్తున్నాడు. పొలం కౌలుకి తీసుకొని మిర్చి సాగు చేశాడు. తెగుళ్లు, అకాల వర్షాలు కారణంగా పంట దెబ్బ తింది. నష్టం వచ్చింది. అప్పులు అయ్యాయి. కొన్నాళ్లుగా మనో వేదన పడుతున్నాడు. ఈ నెల 25వ తేదీ తన మిరప పొలంలో గడ్డి మందు తాగి ఇంటికి వచ్చాడు. అస్వస్థతకు గురైన అతనిని కుటుంబ సభ్యులు నిలదీయటంతో జరిగిన విషయం చెప్పాడు. చికిత్స నిమిత్తం ఆటోలో గుంటూరు సర్వజనాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అక్కడ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తల్లి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

బంగారు చోరీ : బస్సులో కూర్చోవడానికి సీటు ఇచ్చి బంగారు ఆభరణాలు చోరీ చేసిన ఘటన తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా మేడికొండ మండలం పేరిచర్ల గ్రామానికి చెందిన చల్లా రేణుక సత్య దుర్గా మహాలక్ష్మి ఆమె భర్త మురళీకృష్ణ తో కలిసి తూర్పుగోదావరి జిల్లాలోని బిక్కవోలు కుమార సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకునేందుకు సోమవారం అనపర్తి చేరుకున్నారు. బస్సులో కూర్చునేందుకు ఖాళీ లేకపోవడంతో చల్లా రేణుక సత్య దుర్గా మహాలక్ష్మి తాను తీసుకువచ్చిన బ్యాగ్ తో నిల్చుని ఉంది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఆమెకు సీటు ఇవ్వడంతో ఆమె చేతిలో ఉన్న బ్యాగ్​ని ఆ వ్యక్తికి ఇచ్చి ఆమె సీట్లో కూర్చుంది.

కొన్ని నిమిషాల తర్వాత ఆమె బ్యాగ్ తీసుకోగా సీట్ ఇచ్చిన వ్యక్తి బలబద్రపురం గ్రామంలో దిగిపోయాడు. అయితే చల్లా రేణుక సత్య బిక్కవోలు వెళ్లి ఆమె బ్యాగ్​ను పరిశీలించగా అందులో ఉండాల్సిన సుమారు రూ.2 లక్షల విలువ గల బంగారు ఆభరణాలు (మూడు కాసుల మంగళసూత్రము, మూడు కాసుల గొలుసు, అరకాసు అంజి ఉంగరం, అరకాసు సాయిబాబా ఉంగరం, 3 గ్రాముల ఉంగరం, అరకాసు బాలాజీ ఉంగరం, మూడు కాసుల నల్లపూసల దండ) కనిపించ లేదు. దీంతో ఆమెకు సీటు ఇచ్చిన వ్యక్తే తన ఆభరణాలు చోరీ చేసి బలబద్రపురంలో దిగిపోయాడని ఆమె బిక్కవోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బిక్కవోలు ఎస్ఐ బుజ్జి బాబు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి : గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు గుంటూరు జిల్లా ఫిరంగిపురం గ్రామానికి చెందిన త్రిపుర మల్లు గౌతమ్ ఫిరంగిపురంలోని రామాలయం బజారులో గల మణికంఠ జనరల్ స్టోర్స్​లో మూడు నెలలుగా డెలివరీ బాయ్​గా పని చేస్తున్నాడు. రేపుడి సమీపంలో గల ఒక కళాశాల వద్దకు వచ్చిన సమయంలో గౌతమ్ నడుపుతున్న స్కూటీని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తలకు దెబ్బె తగలడంతో అక్కడికక్కడే గౌతమ్ మృతి చెందాడు. మృతుని తండ్రి చిన్న సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిరంగిపురం ఎస్సై శ్రీ లక్ష్మీ నారాయణ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఇద్దరు మృతి : తిరుపతి జిల్లా వడమాల మండలం వెంగళరాజు కండ్రిగ వద్ద ప్రమాదం జరిగింది. వెంగళరాజు కండ్రిగ వద్ద కారు బోల్తాపడి ఇద్దరు మృతి చెందారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.