ETV Bharat / state

విశాఖ భాజపా కార్యాలయంలో ఎమర్జెన్సీ వ్యతిరేకదినోత్సవం - Anti-Emergency Day Bjp Office at Vishakhapatnam

ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విశాఖలోని భాజపా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సమావేశానికి మాజీ ఎంపీ డా. కంభం పాటి హరిబాబు, భాజపా రాష్ట్ర కార్యదర్శి కాశీవిశ్వనాథ్ హాజరయ్యారు.

Anti-Emergency Day Bjp Office at Vishakhapatnam
విశాఖ భాజపా కార్యాలయంలో ఎమర్జెన్సీ వ్యతిరేకదినోత్సవం
author img

By

Published : Jun 25, 2020, 10:10 PM IST

విశాఖలోని భాజపా కార్యాలయంలో ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ డా. కంభంపాటి హరిబాబు, భాజపా రాష్ట్ర కార్యదర్శి కాశీవిశ్వనాథ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ అడాల్ఫ్ హిట్లర్ 1935లో జర్మనీలో ఎమర్జెన్సీ ప్రకటించినట్లే ఇందిరా గాంధీ భారత్​లో ఎమర్జెన్సీ ప్రకటించారన్నారు. కానీ భారతదేశంలో జరిగిన ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమం వల్ల దేశం నిరంకుశత్వ పాలనలోకి వెళ్లకుండా అప్పటి ఉద్యమకారులు, ప్రజలు నిరోధించారని తెలిపారు. 1971 బాంగ్లాదేశ్ విమోచనతో శక్తివంతమైన నాయకురాలుగా ఎదిగిన ఇందిరా గాంధీ 1975లో ఎమర్జెన్సీ విధించటానికి దారి తీసిన పరిస్థితులను వివరించారు. లోకనాయక్ జయప్రకాశ్ నారాయణ్ సంపూర్ణ క్రాంతి ఉద్యమం, ఇందిరా గాంధీ ఎన్నిక రద్దు, విద్యార్థుల ఉద్యమం, జయప్రకాశ్ నారాయణ విజయవాడ పర్యటన, అత్యవసర పరిస్థితి విధింపు తదితర విషయాలను వివరించారు.

ఇదీచదవండి:అనకాపల్లి మురుగునీటి శుద్ధి ప్లాంటును పరిశీలించిన ఎమ్మెల్సీ బుద్ధా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.