విశాఖ మన్య కేంద్రం పాడేరు ఐటీడీఏ వద్ద గత 23 రోజులుగా ఏఎన్ఎంలు ఆందోళన చేపడుతున్నారు. తమను రెగ్యులర్ చేసి గ్రామ సచివాలయంల ఉద్యోగాల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. 17 ఏళ్లుగా పనిచేసిన తమను రేగులర్ చేయాలని ఎన్నో సాధక బాధలు భరించి పనిచేస్తున్న మమ్మల్ని వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి శ్రావణ్ కుమార్ ఏఎన్ఎం లను పరామర్శించి, అండగా ఉంటానని ప్రకటించారు.
ఇదీచూడండి.గూడూరు - విజయవాడ ఇంటర్ సిటీ ప్రారంభం