విశాఖ జిల్లా పాడేరు మండలం సలుగు పంచాయతీ సలుగు దబ్బగరువు గ్రామంలో... పశువులు వింత వ్యాధితో మృత్యువాత పడుతున్నాయి. మందలో ఉన్న గొర్రెలు గిలగిలా కొట్టుకొని విగతజీవులుగా మారాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే రీతిలో ఆవు, దూడ సైతం మృతి చెందాయని.. ఏ రోగం సోకిందో తమకు అర్థం కావటం లేదంటూ రైతులు వాపోయారు.
పశువులను పశు వైద్యశాలకు తీసుకువెళ్లేందుకు.. సరైన రహదారి సదుపాయం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి.. వైద్య శిబిరం ఏర్పాటు చేసి.. పశువులను కాపాడాలని రైతులు వేడుకుంటున్నారు. పశువుల అకాల మరణం ఘటనను ఈటీవీ భారత్ పాడేరు వెటర్నరీ అసిస్టెంట్ సతీష్.. దృష్టికి తీసుకువెళ్లగా, త్వరలోనే వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామన్నారు.
ఇదీ చదవండి: