విశాఖ జిల్లా చీడికాడలో సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడి కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ వాలంటీర్లపై వేధింపులు అపాలని వారు నినాదాలు చేశారు. గ్రామాల్లో వాలంటీర్లను, ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిజాము అంగన్వాడి ఆయాపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీఓ జయప్రకాశ్ రావుకు వినతిపత్రాన్ని అందజేశారు.
ఇదీచదవండి