ETV Bharat / state

సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల్లో అట్టడుగున ఆంధ్రప్రదేశ్.. బిహార్ బెటర్ - Number of startups in the country

Export of Software Products: సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తుల ఎగుమతుల్లో, అంకుర సంస్థల ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో బాగా వెనుకబడింది. చివరకు ఒడిశా, బిహార్‌ వంటి రాష్ట్రాల కంటే దిగువకు ఏపీ పడిపోయింది. పొరుగున ఉన్న తెలంగాణలో మూడోస్థానం దక్కించుకోగా.. మన రాష్ట్రం సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల్లో 15వ స్థానానికి దిగజారింది. ఇక స్టార్టప్‌ల విషయంలోనూ రాష్ట్రం ఇదే పరిస్థితి.

software products
సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులు
author img

By

Published : Dec 17, 2022, 10:35 AM IST

Updated : Dec 17, 2022, 11:47 AM IST

Export of Software Products: 2021-22 ఆర్థిక సంవత్సరంలో సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్ ఆప్ ఇండియా, సెజ్‌ల్లో ఉన్న సంస్థలు కలిపి 11 లక్షల 59 వేల210 కోట్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేశాయి. 3.95 లక్షల కోట్లతో కర్ణాటక.. 2.36 లక్షల కోట్లతో మహారాష్ట్ర.. 1.8 లక్షల కోట్లతో తెలంగాణ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల్లో కేవలం 0.111 శాతంతో రాష్ట్రం 15వ స్థానానికి పరిమితమైంది.

ఏపీలో ఎస్‌టీపీఐ వద్ద నమోదయిన యూనిట్ల నుంచి 926 కోట్లు, సెజ్‌ల్లోని యూనిట్ల నుంచి 364 కోట్లు కలిపి 1,290 కోట్ల విలువైన సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులు మాత్రమే ఎగుమతయ్యాయి. వెనుకబడిన రాష్ట్రంగా చెప్పుకొనే ఒడిశా నుంచి కూడా ఏపీ కంటే 300 శాతం ఎక్కువగా 5,169 కోట్ల ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. శుక్రవారం రాజ్యసభలో భాజపా సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఈ మేరకు సమాధానం ఇచ్చారు.

సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల్లో వెనుకబడిన ఆంధ్రప్రదేశ్

అంకుర సంస్థల్లో ఆంధ్రప్రదేశ్‌ కంటే బిహారే మెరుగైన స్థితిలో ఉంది. కేంద్ర వాణిజ్య శాఖ ఆధ్వర్యంలోని డీపీఐఐటీ గుర్తింపు పొందిన స్టార్టప్‌ల సంఖ్య 2016 నుంచి 2022 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 84 వేల 012 ఉండగా.. ఏపీ వాటా 1.54 శాతమే. ఏపీలో 1,300 ఉండగా, బిహార్‌లో 1,463 ఉన్నట్లు కేంద్ర వాణిజ్యశాఖ సహాయ మంత్రి సోమ్‌ ప్రకాశ్‌ తెలిపారు. భాజపా సభ్యుడు సీఎం రమేష్‌ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. మహారాష్ట్రలో అత్యధికంగా 15వేల 571 స్టార్టప్‌లున్నాయి. మన పొరుగున ఉన్న తెలంగాణలో 4 వేల 426 స్టార్టప్‌లు ఉన్నాయి.

ఇవీ చదవండి:

Last Updated : Dec 17, 2022, 11:47 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.