ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన అనకాపల్లి నూకాలమ్మ కొత్త అమావాస్య జాతర గోడ పత్రికను అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, వైకాపా పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు దాడి రత్నాకర్ ఆవిష్కరించారు. ఈనెల 10 నుంచి మే 11 వరకు నెల రోజుల పాటు జాతర జరగనుందని తెలిపారు. ఈ ఏడాది జాతరను నిర్వహించడానికి ఘనంగా ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు దాడి జయవీర్, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: